‘జాతి రత్నాలు’ 8 డేస్ కలెక్షన్స్..!

న‌వీన్ పోలిశెట్టి,ఫ‌రియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి వంటి స్టార్ కమెడియన్స్ కూడా టైటిల్ రోల్స్ ప్లే చేశారు. ‘స్వ‌ప్న సినిమా’ బ్యాన‌ర్ ‌పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే హిట్ టాక్ రావడంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను నమోదు అయ్యాయి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను సాధించిన ఈ చిత్రం 8 రోజులు పూర్తయినా ఇంకా స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది.

ఇక ఈ చిత్రం 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  11.61 cr
సీడెడ్   2.94 cr
ఉత్తరాంధ్ర   3.23 cr
ఈస్ట్   1.49 cr
వెస్ట్   1.25 cr
గుంటూరు   1.66 cr
కృష్ణా   1.40 cr
నెల్లూరు   0.74 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   24.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.23 cr
ఓవర్సీస్   3.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  29.03 cr

‘జాతి రత్నాలు’ చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా…ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసి 8 రోజులకు గాను ఏకంగా 29.03 కోట్ల షేర్ ను రాబట్టింది. 8వ రోజున కూడా ఈ చిత్రం 1.23 కోట్ల పైనే షేర్ ను నమోదుచేసింది.చూస్తుంటే రెండో వీకెండ్ ను కూడా ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకునేలా ఉంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.