జాన్వీ కపూర్ కు ఇష్టమైన నటుడు ఎవరంటే..?

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు, యాంకర్లు, సింగర్లు సోషల్ మీడియాలో లైవ్ చాట్ లోకి వస్తే నెటిజన్లు సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్నారు. కొత్త హీరోయిన్లతో పాటు ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలకు సైతం ఈ తరహా వేధింపులు తప్పడం లేదు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు సైతం ఇవే తరహా వేధింపులు సోషల్ మీడియాలో ఎదురయ్యాయి. అయితే జాన్వీ మాత్రం నెటిజన్ పై సీరియస్ కాకుండా కూల్ గానే సమాధానమిచ్చారు.

తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ లైవ్ చాట్ లోకి రాగా ఒక నెటిజన్ ఆమెను ముద్దు పెట్టుకుందామా..? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జాన్వీ మాస్క్ తో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు నో అని సమాధానమిచ్చారు. నెటిజన్ పై సీరియస్ కాకుండా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ముద్దులకు చోటు లేదంటూ జాన్వీ నెటిజన్ కు సమాధానం ఇచ్చారు. మరో అభిమాని జాన్వీని డైట్ గురించి ప్రశ్నించగా ఆమె ఐస్ క్రీమ్ కప్పు ఫోటోను షేర్ చేశారు.

ఒక నెటిజన్ జాన్వీని ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా పంకజ్ త్రిపాఠి ఫోటోను షేర్ చేసి అతనే ఇష్టమైన నటుడని వెల్లడించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ ఈ మధ్య కాలంలో హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కెరీర్ లో సక్సెస్ అయ్యే విధంగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్న జాన్వీ కొన్ని రోజుల క్రితం రూహీ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జాన్వీ కపూర్ దోస్తానా 2 అనే సినిమాలో కూడా నటిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus