రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కచ్చితంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చరణ్, తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల విక్రయానికి సంబంధించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఉన్నాయి.
అయితే ఒక సెంటిమెంట్ మాత్రం చరణ్, తారక్ ఫ్యాన్స్ ను గజగజా వణికిస్తోంది. జీ5 ఆర్ఆర్ఆర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. జీ గ్రూప్ కొనుగోలు చేసిన సినిమాల్లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. రాధే, స్పైడర్ సినిమాలను జీ గ్రూప్ కొనుగోలు చేయగా ఈ సినిమాలు ఏ రేంజ్ డిజాస్టర్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమా విదేశీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి జీ5 బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతుందా..? లేక ఆర్ఆర్ఆర్ జీ5 బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా..? చూడాల్సి ఉంది. దాదాపు నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా వచ్చే నెలలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతుండగా ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.