యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం ఉంది. వేర్వేరు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు కృష్ణుడి రోల్ లో నటించాలనే డ్రీమ్ ఉందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తారక్ డ్రీమ్ రోల్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడేమో చూడాలి.
కృష్ణుడి రోల్ కు తారక్ బాగా సూట్ అవుతాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహాభారతం సినిమాలో తారక్ ఈ పాత్రలో నటించి డ్రీమ్ రోల్ కోరికను నెరవేర్చుకుంటాడేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వేగంగానే సినిమాలలో నటిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల ఆయన సినిమాలు వాయిదా పడుతుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ కు తగిన రోల్స్ దక్కితే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర, వార్2, దేవర2, ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతాయో తెలియాల్సి ఉంది. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ 1500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. తారక్ సినిమాల హక్కులు భారీ రేంజ్ లో అమ్ముడవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది. ఇతర భాషల్లో సైతం తారక్ మరింత సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.