యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్1, సింహాద్రి, ఆది, యమదొంగ, బృందావనం, అదుర్స్, బాద్ షా, టెంపర్, జనతా గ్యారెజ్, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఒక ఎన్టీఆర్ అభిమాని తారక్ పై చూపించిన అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక అభిమాని కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నారు.
ఇంటి నిర్మాణం కోసం భారీ మొత్తం ఖర్చు అవుతుండగా తన ఇంటికి ఉపయోగించేలా ప్రతి ఇటుకపై ఎన్టీఆర్ పేరు వచ్చేలా ఈ ఫ్యాన్ జాగ్రత్తలు తీసుకున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పై ఈ అభిమాని చూపించిన అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ఇంత అభిమానమా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా దేవర సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ల షూటింగ్ ఇప్పటికే పూర్తైందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేవర సినిమా షూటింగ్ పూర్తి కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర2 తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. దేవర సినిమాలోని యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని జాన్వీ పాత్ర సరికొత్తగా ఉండనుందని సమాచారం. తంగం అనే పాత్రలో జాన్వీ కనిపిస్తుండగా జాన్వీ తన పాత్రకు ప్రాణం పోశారని తెలుస్తోంది. కొరటాల శివ గత హిట్ సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.