జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన ఇంటి స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. దీని వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో ఎన్టీఆర్ కి సమస్యలు వచ్చి పడ్డాయి. ఆ స్థలాన్ని ఎన్టీఆర్.. ‘సుంకు గీత అనే మహిళ వద్ద 2003లో కొనుగోలు చేశాడట. దానికి లీగల్ గా అన్ని అనుమతులు తీసుకునే ఇంటి నిర్మాణం చేపట్టినట్టు చెబుతున్నాడు ఎన్టీఆర్.
కానీ ఎన్టీఆర్ కి ఆ స్థలం అమ్మిన వాళ్ళు.. 1996లో వేరే వల్ల వద్ద దాని డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకున్నారంటూ ఎస్‌బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్‌సఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ను ఆశ్రయించడం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఎన్టీఆర్ కి ఈ తలనొప్పి అంతా వచ్చి పడింది.
ఎన్టీఆర్ కి లిటిగేషన్ స్థలాన్ని అమ్మడం గీత తప్పే. ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్ కి అమ్మేసి వదిలించుకుంది. కానీ అప్పటికే ఆ స్థలం పై 5 బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంది. కానీ ఒక్క బ్యాంకులోనే లోన్ ఉందని ఎన్టీఆర్ కి చెప్పింది. ఎన్టీఆర్ ఆ లోన్ క్లియర్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించి స్థలాన్ని దక్కించుకున్నాడు.
కానీ మిగతా బ్యాంకుల్లో కూడా అప్పు ఉన్నట్టు అతనికి తెలీదు. అందుకే ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయియించాడు. జూన్ 6న విచారణ జరగనుంది. మరి అతనికి అనుకూలంగా తీర్పు వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.