యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ జెనరేషన్ హీరోల్లో అభిమానులను కుటుంబ సభ్యుల్లా భావించే స్టార్ హీరో.. ఏ కార్యక్రమంలో మాట్లాడినా చివర్లో క్షేమంగా ఇంటికి వెళ్లమని కేరింగ్‌గా చెప్తూ.. అనునిత్యం వారి క్షేమాన్ని కాంక్షిస్తుంటాడు.. అలాగే తన సినిమా ప్రారంభంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన నాన్న హరికృష్ణ, అన్నయ్య జానకి రామ్‌లను చూపిస్తూ జాగ్రత్తలు పాటించమని చెప్తుంటాడు.. నందమూరి వంశం నుండి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు..
ఇప్పటి యువతలో తనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ‘టెంపర్’ తో మొదలుపెట్టి ‘ఆర్ఆర్ఆర్’ తో వరుసగా ఆరు సూపర్ హిట్స్ కొట్టి డబుల్ హ్యాట్రిక్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.. ట్రిపులార్‌తో మొదటిసారి పాన్ ఇండియా రేంజ్‌లో ఇంట్రడ్యూస్ అవడమే కాక గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. తెరమీద నటన, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే కాదు తెరవెనుక తారక్ తోపే అని ఇటీవల ప్రూవ్ చేశాడు..
RRR జపాన్ ప్రమోషన్స్‌లో జపనీస్ భాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.. ఇక యూఎస్‌లో తను మాట్లాడిన ఇంగ్లీష్ మాడ్యులేషన్ చూసి అంతా ఫిదా అయిపోయారు.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ సాధించింది.. తారక్ హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు.. వచ్చాక తను పాల్గొన్న ఫస్ట్ ఈవెంట్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శుక్రవారం (మార్చి 17) రాత్రి జరిగిన ఈ వేడుకలో ఆస్కార్ గురించి, విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడాడు తారక్..
స్పీచ్ తర్వాత స్టేజీ దిగుతుండగా.. సడన్‌గా ఓ అభిమాని ఎన్టీఆర్ మీదకి దూసుకొచ్చి పట్టేసుకున్నాడు.. బౌన్సర్స్ అతడిని పక్కకి లాగేసే ప్రయత్నం చేశారు కానీ ఎన్టీఆర్ వారిని ఆగమని చెప్పి.. ఆ అభిమానిని హగ్ చేసుకుని ఫోటో దిగి పంపించేశాడు.. ‘‘ఫ్యాన్స్ అంటే ఇంత ప్రేమ చూపిస్తావ్.. నువ్వు దేవుడివి స్వామీ’’ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్