ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ను ముందుగానే ప్రకటించినా వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్ ను మార్చుకుంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే దేవర సినిమా మాత్రం ఈ విషయంలో ఇతర సినిమాలకు భిన్నమనే చెప్పాలి. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సమ్మర్ కానుకగా విడుదలయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే.
దేవర సినిమా సైతం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా తారక్ తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ కు వెళ్లగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఘన స్వాగతం లభించింది. వెల్‌కమ్ టు జపాన్.. వీ లవ్ యు తారక్ జపాన్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. దేవర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్లు సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఎన్టీఆర్ విదేశాల్లో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ షాకిస్తున్నారు. రాబోయే రోజుల్లో తారక్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దేవర సినిమా విషయంలో ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తే ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే భావన చాలామందికి కలుగుతుంది.
దేవర సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర (Jr NTR) ఎన్టీఆర్ మార్కెట్ ను కూడా భారీ స్థాయిలో పెంచే ఛాన్స్ అయితే ఉంది. అనుకున్న బడ్జెట్ లెక్కల ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.