బాబాయ్ తో మల్టీస్టారర్ పై ఎన్టీఆర్ పెదవి విరుపు

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఓ విశిష్టత ఉంది. వెండితెర వేలుపుగా వెలిగిన నందమూరి తారకరామారావు నట వారసత్వం కలిగిన కుటుంబం అది. ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న రోజులలో తన కుమారులతో కలిసి సినిమాలు చేశారు. ఎన్టీఆర్ కుమారులలో కొందరు నిర్మాతలుగా మారగా హరికృష్ణ, బాలకృష్ణ నటులుగా మారారు. హరి కృష్ణ, బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించడం జరిగింది. గత చరిత్ర ఎలాగున్నా టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తే చూడాలని నందమూరి వీరభిమానుల పెద్ద ఆశ.

ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ అదృష్టం చేసుకుంది. ఏ ఎన్ ఆర్ తో కూడిన మూడు తరాల నటులు కలిసి చిరకాలం గుర్తుండిపోయేలా మనం మూవీ చేసి భారీ విజయం అందుకున్నారు. ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ ఇమేజ్ కి తగ్గట్టుగా అలాంటి ఓ భారీ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ విషయంలో ఎన్టీఆర్ సుముఖంగా లేరన్నది అందరికీ తెలిసిన వాస్తవం. బాలయ్యతో ఎన్టీఆర్ కి అంత సాన్నిహిత్యం లేదు.

అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించారు. ఆ మూవీలో ఎన్టీఆర్ నటిస్తే ఈ ముగ్గురు కలిసి నటించి చిత్రం అయ్యేది. ఇప్పటికి కూడా కళ్యాణ్ రామ్ ఆ ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్టీఆర్ కి ఇష్టం లేక పక్కన బెడుతున్నాడట.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus