యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒకవైపు తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో గెస్ట్ రోల్స్ లో, కీలక పాత్రల్లో నటించడానికి ఓకే చెబుతున్నారు. అయితే బాలీవుడ్ లో కూడా మార్కెట్ మరింత పెరిగే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్లాన్ వర్కౌట్ అయితే బాలీవుడ్ ను రూల్ చెయ్యడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మార్కెట్ ను రెట్టింపు చేసుకోవాలనే జూనియర్ ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది.
తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఇతర హీరోలకు భిన్నంగా తారక్ ప్లానింగ్ ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR) డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని ఈ సినిమాలలో ఎన్టీఆర్ పాత్ర చనిపోతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. దేవర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. కొరటాల శివ దేవర సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాల్సి ఉంది. కొరటాల శివ కెరీర్ కు ఈ సినిమా కీలకమని చెప్పవచ్చు.
దేవర సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే కొరటాల శివకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. కొరటాల శివ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు కొరటాల శివ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.