గత రెండు రోజులుగా తారక్ త్రివిక్రమ్ కాంబో సినిమా గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. పౌరాణిక సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో తారక్ ఫ్యాన్స్ సంతృప్తితో లేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పౌరాణిక కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య నటించిన సినిమాలలో పలు పౌరాణిక సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ కు సైతం పౌరాణిక సినిమాలను తెరకెక్కించిన అనుభవం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు. తారక్ ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో ప్రతి సినిమాతో సక్సెస్ సాధించాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ పై ఉంది.
ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబితే మాత్రం తారక్ కెరీర్ పరంగా పెద్ద తప్పు చేసినట్టు అవుతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో తారక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ మూడేళ్ల డేట్లు కేటాయించారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.
ఒక్కో ప్రాజెక్ట్ కు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారక్ ప్రతి ప్రాజెక్ట్ తన ఫ్యాన్స్ కు నచ్చేలా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్30 మూవీలో జాన్వీ కపూర్ దాదాపుగా ఫైనల్ అయ్యారు. ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ దాదాపుగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. తారక్ ప్రాజెక్ట్ ల ఎంపిక అదుర్స్ అనేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.