సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా షూటింగ్ లలో పాల్గొనడానికి అస్సలు ఆసక్తి చూపరు. జ్వరం ఉంటే ఎన్నిరోజులు షూటింగ్ కు బ్రేక్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక సాంగ్ కోసం తారక్ (Jr NTR) మాత్రం 104 డిగ్రీల జ్వరంతో బాధ పడుతూ కూడా డ్యాన్స్ చేశారు. టెంపర్ (Temper) సినిమాలోని టైటిల్ సాంగ్ షూట్ సమయంలో తారక్ జ్వరంతో బాధ పడుతున్నారు. టెంపర్ సినిమాకు ముందు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే.
టెంపర్ సినిమా కోసం ఎన్టీఆర్ పడిన కష్టం అంతాఇంతా కాదు. టెంపర్ సినిమాకు అనూప్ రూబెన్స్ (Anup Rubens) మ్యూజిక్ అందించగా మణిశర్మ (Mani Sharma) బీజీఎం అందించడం గమనార్హం. తారక్ కష్టపడి డ్యాన్స్ చేసిన మీ తాత టెంపర్ మీ అయ్య టెంపర్ అంటూ లిరిక్స్ తో సాగే ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ విషయంలో టాప్ అనే సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే డేట్ ఫిక్స్ అయింది. మే నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. దేవర సినిమా ట్యూన్స్ విషయంలో అనిరుధ్ (Anirudh Ravichander) ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.
దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారో లేదో క్లారిటీ రావడం లేదు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా దేవర2 షూట్ ఎప్పుడు మొదలవుతుందో సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. దేవర సినిమాపై ఇతర భాషల్లో సైతం భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.