Jr NTR, Pawan Kalyan: తారక్, పవన్ ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లేదుగా.. అసలేం చేశారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, తారక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. పవన్ సాయితేజ్ కాంబో మూవీకి బ్రో అనే టైటిల్ ఫిక్స్ కాగా ఈ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మరో రెండు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్30 సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానుంది. తారక్ ఇతర సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్30 హ్యాష్ ట్యాగ్ తో పాటు పవన్ సాయితేజ్ సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దే కాల్ హిమ్ ఓజీ, జూనియర్ ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి.

(Jr NTR) ఎన్టీఆర్, పవన్ సోషల్ మీడియాలో దూకుడు చూపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో పవన్, తారక్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. అటు పవన్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఎన్టీఆర్, పవన్ సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ మూడు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలకు ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరోలు రాబోయేరోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు భావిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus