పాన్ ఇండియా స్థాయిలో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. గత కొద్దిరోజులుగా షూటింగ్, టైటిల్ ప్రచారం వంటి అంశాలతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. మొదట ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా, తాజాగా మేకర్స్ నుంచి కొత్త అధికారిక అప్డేట్ వచ్చింది. సినిమాను వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు అభిమానులను మిక్స్డ్ రియాక్షన్‌కు గురి చేస్తోంది.
సాధారణంగా సంక్రాంతి లాంటి పెద్ద సెలవుల్లో స్టార్ హీరోల సినిమాల విడుదల కోసం ప్రాధాన్యత ఇస్తారు. కానీ వేసవి చివర్లో, స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయిన టైమింగ్‌లో రిలీజ్ ప్లాన్ చేయడం కొంత రిస్క్ అనిపించుకుంటోంది. అయినా స్టార్ హీరోల సినిమాలకు ఈ విధమైన సీజన్లు పెద్దగా అర్థం ఉండవు. సినిమా కంటెంట్ పవర్‌ఫుల్ అయితే ఎలాంటి టైమ్‌లో అయినా విజయాన్ని సాధించగలదని గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
‘బాహుబలి’ (Baahubali) మొదటి భాగం కూడా జూలైలో విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఇప్పటికే సెట్స్ లో అడుగు పెట్టగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో డార్క్ బ్యాక్‌డ్రాప్ ఉండబోతోందని, తారక్ క్యారెక్టర్ మాస్, ఇంటెన్స్ అవతారాన్ని చూపించబోతోందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
రవి బస్రూర్ (Ravi Basrur) అందించే మ్యూజిక్ ఈ సినిమాకు మరో బలమైన హైలైట్ కానుంది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతున్న ఈ సినిమా, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని చెబుతున్నారు. ‘కేజీఎఫ్'(KGF) తరువాత ప్రశాంత్ నీల్ స్టైల్ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం ఈ సినిమాకి భారీ అంచనాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ ఎనర్జీ, నీల్ మేకింగ్ కలయిక మీద ఇండస్ట్రీలో కూడా ఆసక్తి పెరిగింది.