యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్1, సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. ఈ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ పాత్ర కోసం 150 కేజీల బరువు పెరగడానికి అయినా సిద్ధమే సిద్ధమేనని వెల్లడించారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బరువు పెరగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్టీఆర్ అన్నారు.
అకస్మాత్తుగా 150 కిలోల బరువు పెరగాల్సిన అవసరం ఉంటే ఆ స్థాయిలో బరువు పెరగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించారు. పాత్రకు అనుగుణంగా బరువు తగ్గాలంటే కూడా నేను తగ్గిపోతానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఒక నటుడికి అలాంటి అవకాశాలు తక్కువగా వస్తాయని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించడం గమనార్హం. అలాంటి అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ కథ మరీ అంత అద్భుతంగా ఉంటే బరువు పెరగడానికి తగ్గడానికి నాకు అభ్యంతరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎడిమోల్ఫి అనే యాక్టర్ 500 కిలోల మనిషిగా చేశాడని 50 కిలోల మనిషిగా చేశాడని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇది చాలా తక్కువమందికి దొరికే అవకాశం అని ఆయన తెలిపారు.
ప్రస్తుతం దేవర సినిమాతో తారక్ (Jr NTR) బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. దేవర సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ భాగస్వామిగా ఉందనే సంగతి తెలిసిందే. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.