సీనియర్ ఎన్టీఆర్ మనవడు , నందమూరి హరికృష్ణ చిన్న కొడుకు అయిన జూ.ఎన్టీఆర్… సినీ పరిశ్రమలో ఎవరి వారసులకు సాధ్యం కాని విధంగా 20 ఏళ్ళలోపే స్టార్ డంని…. సంపాదించుకున్నాడు. స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలు ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.2003 లోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగా రికార్డులు సృష్టించాడు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ ను వరుస ఫ్లాపులు పలకరించాయి.
అదే టైంలో ఫ్యామిలీ కూడా ఇతన్ని దూరం పెట్టినట్టు కథనాలు కూడా వినిపించాయి. అయితే ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో కొంతమంది నటీనటులతో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరు సీనియర్ నటులు, ఓ కమిడియన్ తో ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉండేవాడు. తాను నటించే ప్రతి సినిమాలో ఆ నటులకు ఛాన్స్ లు ఇచ్చేవాడు. కానీ ఎన్టీఆర్.. గతంలో ఫ్యామిలీతో కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాగే అదే టైంలో మరో అగ్ర హీరో అభిమానులు జూ.ఎన్టీఆర్ పై ట్రోలింగ్ జరిపేవారు.
ఇష్టమొచ్చినట్టు తిట్టిపోసేవారు. మరోపక్క (Jr NTR) ఎన్టీఆర్ సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అయ్యేవి. ఆ టైంలో ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి .. తన ఫ్రెండ్స్ నిరాకరించేవారట. అలాంటి అవమానాలు కూడా ఎన్టీఆర్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఎన్టీఆర్ తో రాజమౌళి ‘యమదొంగ’ తీసాడో… ఆ సినిమాతో ఎన్టీఆర్ తన పాత స్నేహితులను కలిశాడట. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మళ్ళీ పెరిగింది. మళ్ళీ హిట్లు పలకరించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కు దేశవిదేశాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.