Jr NTR: వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరుస విజయాలతో జోరుమీదుండగా లక్ష్మీప్రణతి పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నేను ప్రైవేట్ థియేటర్ లో ఆర్.ఆర్.ఆర్ చూశానని ఎక్కడో కూర్చున్న మా అమ్మ నా ఇంట్రడక్షన్ సీన్ చూసి బాగా చేశావని మెచ్చుకుంటూ నా పక్కన కూర్చుందని ఇది నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. నా భార్య లక్ష్మీ ప్రణతి నన్ను పూర్తిగా మార్చేసిందని నేను పెళ్లికి ముందు ఒకలా ఉండేవాడినని తారక్ అన్నారు.

పెళ్లికి ముందు నాకు కోపం ఎక్కువని ఇప్పుడు ఆ కోపం ఏమైందో కూడా నాకు తెలియదని తారక్ చెప్పుకొచ్చారు. నా భార్యను నేను ఎంతో గౌరవిస్తానని హోమ్ మినిష్టర్ లక్ష్మీ ప్రణతి సూచనలను పాటిస్తానని తారక్ చెప్పుకొచ్చారు. నా పెద్ద కొడుకు అభయ్ రామ్ అంటే క్వశ్చన్ బ్యాంక్ అని తారక్ తెలిపారు. అభయ్ మెదడులో ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న ఉంటుందని కొన్ని ప్రశ్నలకు ఓపికగా జవాబు చెబుతానని మరికొన్ని ప్రశ్నలు మాత్రం నాకు అర్థం కావని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ రీజన్ వల్లే అభయ్ అంటే భయమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. లక్ష్మీ ప్రణతి మాత్రం అభయ్ రామ్ ప్రశ్నలకు బలైపోతుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని రెండోసారి అమ్మాయి పుడుతుందని అనుకున్నానని తారక్ తెలిపారు. ఈ రీజన్ వల్లే తనకు ఆడపిల్లలు ఉన్నవాళ్లను చూస్తే అసూయ కలుగుతుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

ఎన్టీఆర్ నే అభయ్ భయపెట్టాడని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 29 నుంచి కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీ స్పెషల్ గా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus