యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా కోసం, సినిమాలోని పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా త్వరలో గోవాలో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది. మండు వేసవిలో చాలామంది హీరోలు షూటింగ్ కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఒకవేళ షూటింగ్ లో పాల్గొన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర (Devara) కోసం విశ్రాంతి లేకుండా కష్టపడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. దేవర రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఇప్పటికే తారక్ ఇతర సినిమాలకు డేట్స్ కేటాయించిన నేపథ్యంలో ఈ సినిమా షూట్ వేగంగా జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) గాయం వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి వచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ సలార్2 మూవీ పూర్తైన వెంటనే మొదలు కానుందని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మరికొన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వనున్నారు. దేవర2 మూవీ షూటింగ్ ను ఎప్పటినుంచి మొదలుపెడతారో స్పష్టత రావాల్సి ఉంది. దేవర2 సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర2 సినిమా ఫస్ట్ పార్ట్ ను మించి ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే దేవర2 సినిమాపై అంచనాలు పెరుగుతాయి.
దేవర1 గ్లింప్స్ అంచనాలను పెంచగా మే నెలలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది. అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు రాలేదు. తారక్ ప్రస్తుతం పలు ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.