యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా మూడు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్30, ఎన్టీఆర్31, ఎన్టీఆర్32 సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా ఈ మూడు సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ఈ మూడు సినిమాలకు కనీసం 1500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే తన సినిమాలతో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయాలని తారక్ భావిస్తున్నారు.
తన మూడు సినిమాలలో ఒక సినిమాతో అయినా కుదిరితే బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయాలని కుదరకపోతే ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను బ్రేక్ చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్లానింగ్ బాగుందని రిలీజ్ డేట్ల విషయంలో కూడా ఆయన పక్కాగా ఉన్నారని తెలుస్తోంది. కథ విషయంలో, హీరోయిన్ల విషయంలో, టెక్నీషియన్ల విషయంలో ఎన్టీఆర్ ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని బోగట్టా.
ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలు కచ్చితంగా మంచి రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలకు లాభాల్లో వాటా తీసుకోనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేయడంతో పాటు మాస్ యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో హాలీవుడ్ లెవెల్ లో తారక్ సక్సెస్ సాధిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. తారక్ కు సౌత్ రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో కూడా ఊహించని రేంజ్ లో మార్కెట్ పెరుగుతోంది.