యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ నెల నుంచి మొదలుకానుండగా ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఇంటెన్స్ డ్రామా అని ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని ఆయన వెల్లడించారు.
ఈ సినిమా డ్రామాతో నిండి ఉంటుందని డ్రామాతో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యమవుతుందని తాను భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ మెచ్చే హీరోయిజం కూడా ఈ సినిమాలో ఉంటుందని తారక్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రేక్షకులు తన నుంచి ఏయే అంశాలను కోరుకుంటారో ఈ సినిమాలో ఆ అంశాలన్నీ ఉంటాయని ఆయన అన్నారు. ఎన్టీఆర్ తన మాటలతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.
ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని తారక్ క్లారిటీ ఇచ్చారు. జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో లోకల్ గా రిపేర్లు చేయగా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రిపేర్లు చేయాలని భావిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కాగా అలియా భట్ తారక్ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.