యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ అక్టోబర్ నెల 10వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే గతంలో రిలీజైన పోస్టర్లకు తాజాగా రిలీజైన పోస్టర్ కు చాలా తేడా ఉంది. గతంలో రిలీజైన పోస్టర్లను తాజాగా రిలీజైన పోస్టర్ ను గమనిస్తే ఈ రెండు పోస్టర్లలో ఎన్టీఆర్ లుక్ విషయంలో ఎన్నో తేడాలు ఉన్నాయి. మరోవైపు తాజా పోస్టర్ లో వర అనే అక్షరాలు రెడ్ కలర్ లో ఉన్నాయి.
దేవర సినిమాలో తండ్రి పేరు దేవర అని కొడుకు పేరు వర అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర కొత్త పోస్టర్ లో ఇంత అర్థముందా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవర టీజర్ లేదా ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా కథకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
దేవర1 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి కారిటీ రావాల్సి ఉంది. గ్రాఫిక్స్ పనుల వల్ల కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. దేవర ప్రమోషన్స్ మొదలైతే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో సందేహాలకు చెక్ పడుతుందని చెప్పవచ్చు.
దేవర (Devara) సినిమాలో మరికొన్ని పాత్రలు కూడా ఉండనున్నాయని ఆ పాత్రలు సర్ప్రైజింగ్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించేలా ఉండనుందని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. దేవర మూవీ హిట్టైతే మాత్రమే కొరటాల శివకు కొత్త ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు.