మాస్ అభిమానులను ఎక్కువ కలిగి ఉన్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే అయన సినిమాలో యాక్షన్ తప్పనిసరి. ఇక డ్యాన్స్ లు చెప్పనవసరం లేదు. తారక్ స్పీడ్ కి తగినట్లు సంగీత దర్శకులు హుషారైన పాటలను ఇస్తుంటారు. ఆ పాటలను థియేటర్లో చూస్తున్నప్పుడు చిన్న, పెద్ద అని తేడాలేకుండా సీట్లో నుంచి లేచి విజిల్ వేయకుండా ఉండలేరు. అటువంటి పాటల్లో కొన్నింటిని మీకు అందిస్తున్నాం.
1. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి
నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తారక్ సుబ్బు చిత్రంతో స్పీడ్ పెంచాడు. ఇందులో “మస్తు మస్తు సంగతుంది నీలో పోరి ” పాటను మణిశర్మ పక్కా మాస్ బీట్ తో అదరగొట్టాడు. ఆర్.పి.పట్నాయక్, గంగలు ఉత్సాహంగా పాడి ఊపునిచ్చారు.
2. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి
ఎన్టీఆర్ పాటల్లో ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ “నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి”. సింహాద్రిలోని ఈ పాట చాలా పాపులర్ అయింది. ఈ పాట తెరపై వస్తుంటే అభిమానుల విజిల్స్ తో థియేటర్లు నిండిపోయాయి.
ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన ఈ పాటను టిప్పు, కె.ఎస్.చిత్రలు అద్భుతంగా పాడారు.
3. రాఖీ, రాఖీ
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎన్టీఆర్ కోసం రాఖీ సినిమాలో అదిరిపోయే పాటలు ఇచ్చారు. ఇందులో రాఖీ.. రాఖీ పాట దేవీ శ్రీ ప్రసాద్, మమతా మోహన్ దాస్ పోటీ పడి పాడి హిట్ చేయించారు.
4. రబ్బరు గాజులు
ఎం.ఎం.కీరవాణి యమదొంగ చిత్రానికి కత్తి లాంటి ఆల్బమ్ ని ఇచ్చారు. ఇందులోని రబ్బరు గాజులు పాట మాస్ కి బాగా కనెక్ట్ అయింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహేంది తొలి సారి యంగ్ టైగర్ కోసం ఈ పాటను పాడారు.
5. చిన్నదో వైపు.. పెద్దదో వైపు
ఎన్టీఆర్ ఇద్దరి హీరోయిన్ లతో చేసిన పాటలు అభిమానులకు బాగా కిక్ ని ఇచ్చాయి. బృందావనం సినిమాలోని “చిన్నదో వైపు.. పెద్దదో వైపు” పాట కూడా అంతే కిక్ ఇచ్చింది. ఎస్.ఎస్. థమన్ ఇందుకు సరి కొత్త మ్యూజిక్ అందించి అలరించారు.
6. తాలియా తాలియా
తారక్ భారీ బడ్జెట్ సినిమా శక్తి లోని తొలి పాట “తాలియా తాలియా” అందరితో చప్పట్లు కొట్టించింది. మణిశర్మ మరో సారి ఎన్టీఆర్ కి మంచి ఆల్బమ్ ని ఇచ్చారు. గాయకుడు రంజిత్ హుషారైన స్వరం తారక్ కి బాగా సెట్ అయింది.
7. దాండియా
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ యంగ్ టైగర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఊసరవెల్లి. ఇందులో అన్ని పాటలు సూపే హిట్ అయ్యాయి. ముఖ్యంగా “దాండియా” పాట ప్రేక్షకుల కాళ్లను కుదురుగా ఉంచలేక పోయింది.
8. బంతిపూల జానకి
ఎస్.ఎస్. థమన్ వాడే వాయిద్యాలు, ఎంచుకునే బాణీలు కొత్తగా ఉంటాయి. అది మాసా.. క్లాసా అని విడదీయలేము. అలాంటి ఆల్బమ్ ని బాద్ షా కోసం ఇచ్చారు. ఇందులో “బంతిపూల జానకి” పాట అభిమానులకు బాగా నచ్చింది. దలేర్ మెహేంది మరోసారి తారక్ కోసం హిట్ అందించారు.
9. మీ తాత టెంపర్
టెంపర్ సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు ప్లస్ అయ్యాయి. అందులో “మీ తాత టెంపర్” సాంగ్ నందమూరి అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినా రోజు థియేటర్లో అందరూ లేచి డ్యాన్సులు చేశారు.
10. నేను లోకల్
జనతా గ్యారేజ్ పాటలతో తారక్ అభిమానులను మరోమారు సంగీత కైపులో దింపేసాడు రాక్ స్టార్. ఇందులో నేను లోకల్ అనే సాంగ్ చిత్రం విడుదలకు ముందే మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయింది. ఈ పాటలో కాజల్, యంగ్ టైగర్ హంగామాను సెప్టెంబర్ 2 న థియేటర్లలో చూసి విజిల్ వేయకుండా ఎవరూ ఉండలేరు.