Jr NTR vs Vijay Thalpathy: ఎన్టీఆర్ Vs విజయ్: ఆ సీజన్ ఎవరిది?
- January 28, 2025 / 03:20 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమా రంగంలో సంక్రాంతి సీజన్ ను ఒక గొప్ప పండుగలా భావిస్తారు. పెద్ద హీరోల సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభిమానులకు పండగ కిక్ ను అందిస్తాయి. ఇక 2026 సంక్రాంతి సీజన్ కి ఇదే రేంజ్ లో పోటీ ఉండబోతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరియు తమిళ సూపర్ స్టార్ విజయ్ (Vijay Thalpathy) బాక్సాఫీస్ పోరుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.
Jr NTR vs Vijay Thalpathy

ఈ సినిమా టైటిల్ డ్రాగన్ గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎన్టీఆర్ (Jr NTR) పాత్రకు పూర్తి స్థాయి మాస్ ఎలివేషన్స్ ఉంటాయని టాక్. ఈ చిత్రం 2026 సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. అదే సమయంలో ఇళయ దళపతి విజయ్ తన 69వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
హెచ్ వినోత్ (H Vinoth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘జన నాయగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన డ్రామాగా తెరకెక్కుతోంది. ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) చిత్రంలోని కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ తీసుకొని ఈ చిత్రాన్ని రూపొదించినట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ (Pooja Hegde) గా నటిస్తుండగా, ఇది తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావచ్చని టాక్. ఇరు చిత్రాల మధ్య వచ్చే సంక్రాంతికి గట్టి పోటీ ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ (Jr NTR) -ప్రశాంత్ నీల్ మూవీ తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకోగా, విజయ్ పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని పెద్ద చిత్రాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ పోటీపై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు ఎన్టీఆర్ మాస్ క్రేజ్, మరోవైపు విజయ్ స్టార్డమ్.. ఈ రెండింటిలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
















