టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు ఎలాంటి డైలాగ్ ఇచ్చినా అద్భుతంగా చెబుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తారక్ స్పోర్ట్స్ కూడా అద్భుతంగా ఆడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ క్రికెట్ బాగా ఆడతారనే సంగతి తెలిసిందే. అయితే తారక్ బ్యాడ్మిటన్ కూడా అద్భుతంగా ఆడతారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సుధీర్ బాబు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్యాట్మెంటన్ ఆడటంలో జూనియర్ ఎన్టీఆర్ తోపు అని సుధీర్ బాబు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ ఎక్కువగా ఆడేవారని ఆయన కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైనా బ్యాట్మెంటన్ ఆడుతున్నట్టు తెలిస్తే ఎక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే వారని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఆట మధ్యలో అభిమానులు సంతోషించేలా తారక్ తొడ కూడా కొట్టేవారని సుధీర్ బాబు కామెంట్లు చేశారు. సుధీర్ బాబు చేసిన కామెంట్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
కొంతమంది అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బ్యాట్మెంటన్ ఆడతారని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నామని పేర్కొన్నారు. దేవర, వార్2 సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఈ రెండు సినిమాల తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. దేవర మూవీ రిలీజ్ కు సరైన రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై తారక్ నటించే సినిమాలకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భాగస్వామిగా ఉంటుందని భోగట్టా..
కళ్యాణ్ రామ్ నిర్మాతగా మరింత ఎదిగేలా తారక్ (Jr NTR) ప్లాన్ ఉందని తెలుస్తోంది. సోలో రిలీజ్ డేట్ దక్కితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర షూట్ పూర్తై మ్యూజిక్, బీజీఎం, విజువల్ ఎఫెక్స్ట్ పనులు పూర్తైన తర్వాతే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.