టాలీవుడ్ లో చిన్న సినిమాలు….పెద్ద సినిమాలు అన్న భేదం ఎప్పుడు ఉండేదే…అయితే ఎప్పటి నుంచో చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు అన్న టాక్ బలంగా వినిపిస్తూనే వస్తుంది. అయితే చిన్న సినిమా ఇంకా బ్రతకదు అన్న టాక్ బలంగా వినిపిస్తున్నప్పటికీ కలెక్షన్స్ ప్రకారం మాత్రం చిన్న సినిమాలు దూసుకుపోతున్నాయి. మొన్న పెళ్లి చూపులు సినిమా సూపర్ హిట్ అయిన వెను వెంటనే….శ్రీనివాస్ అవసరాల సంధించిన సైలెంట్ సినిమా “జ్యో అచ్యుతానంద” సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది…ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. మౌత్ టాక్ కూడా బాగుంది. వెరసి కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్నాయి.
ఇక అదే క్రమంలో క్లాస్ సినిమాలను ఆదరించే మన ఎనార్ఐ ప్రేశ్షాకులు ఈ సినిమాను సూపర్ గా ఆదరిస్తున్నారు. ప్రిమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.ఇప్పటికే ఈ సినిమా 4 లక్షల డాలర్లకు పైనే వసూలు చేసింది. సెకండ్ వీకెండ్లో హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టబోతున్న ‘జ్యో అచ్యుతానంద’కు.. రెండో వారంలో స్క్రీన్లు కూడా పెరుగుతుండటం విశేషం. అమెరికాలో ఎక్కడైతే మన తెలుగు వారు ఉంటున్నారో….వారున్న ప్రతీ చోట ఈ సినిమాను ప్రదర్శించాలి అని డిమాండ్ చేస్తున్నారట. దీంతో రెండో వారాంతానికి స్క్రీన్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. దాదాపు తెలుగు వారుండే అన్ని ఏరియాల్లోనూ జ్యో అచ్యుతానంద ప్రదర్శితం కాబోతోంది. అదే క్రమంలో దగ్గర్లో బడా సినిమాలు ఏమీ లేకపోవడంతో ఫుల్ రన్లో ఈ సినిమా 7 లక్షల డాలర్ల దాకా వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.