కబాలి హంగామా మొదలైపోయింది. బుకింగ్ ఇలా మొదలైందో లేదో…అప్పుడే మల్టీప్లెక్స్ థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చేస్తున్నాయి. కబాలి విడుదల రోజు.. చెన్నైలోని సాఫ్ట్ వేర్ కంపెనీలు సెలవు ప్రకటించాయి. తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన షోలు ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా 32 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. మొత్తంమీద చూస్తే 200 కోట్లకుపైగానే బిజినెస్ జరిగింది. వసూళ్లపై కూడా చిత్ర నిర్మాత థాను చాలా నమ్మకంగా ఉన్నాడు.
తమ సినిమా 500 కోట్లు వసూలు చేయడం ఖాయమని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ”రజనీకాంత్‌కి ప్రపంప వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. వాళ్లంతా కబాలి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం రూ.500 కోట్లు సాధిస్తాం” అంటున్నారాయన. అదే జరిగితే…. రజనీ ఫ్యాన్స్‌కి పండగే.