నటుడు కైకాల సత్యనారాయణ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆఖరి శ్వాస వదలారు. ఎన్నో సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ గత ఆరు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి సేవలు అందించినటువంటి ఈ నవరస నట సర్వబౌముడు ఇండస్ట్రీకి సెలవు చెప్పారు. సిపాయి కూతురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కైకాల హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు.
ఈయన ఎన్నో జానపద పౌరాణిక సినిమాలలో నటించి అద్భుతమైన పాత్రలలో సందడి చేశారు. ఈయన ఆరు దశాబ్దాల సినీ కెరియర్లో 770 సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించినటువంటి కైకాల గత ఆరుదశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారనే విషయం గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. కైకాల ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ సినిమాని శ్వాసగా బతికిన ఈయన ఆస్తులను పెద్దగా కూడా పెట్టలేదని తెలుస్తోంది.
వందల సినిమాలలో నటించినప్పటికీ గత ఏడాది ఈయనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈయన ఆరోగ్య కర్చులకు సహాయం అందించిన సంగతి మనకు తెలిసిందే. కైకాల సత్యనారాయణకు రెండు కార్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్నోవా క్రిస్టా కారు కాగా.. మరొకటి 67 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ జి ఎల్ సి క్లాస్ కారు. ఈ కార్ల విలువ కలిపి సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది.
నాగార్జున రెసిడెన్సీ గచ్చిబౌలిలో గల ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి ధర రూ. 1.5 కోట్లు ఉండొచ్చు . ఇది కాకుండా బెంగళూరులో కూడా ఓ ఇల్లు ఉందని సమాచారం. ఇంతకు మించి కైకాల పెద్దగా ఆస్తులు ఏమి కూడా పెట్టలేదని తెలుస్తుంది.