Kajal: బేబీ బంప్ తో కాజల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‏లో కు ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. అటు తర్వాత వచ్చిన ‘చందమామ’ ‘మగథీర’ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు 14 ఏళ్ళుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అనూహ్యంగా గత సంవత్సరం ఎండింగ్లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది.అలా అని ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకోలేదు. ‘మోసగాళ్ళు’ ‘ఆచార్య’ వంటి చిత్రాల్లో నటించింది.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘోస్ట్’ చిత్రంలో కూడా కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. అయితే సినిమా మొదలయ్యాక కాజల్ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రకారం భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. డూప్ ను పెట్టి మేనేజ్ చేసినా.. అందుకు నిర్మాతలు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే కాజల్ ను పక్కన పెట్టి వేరే హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కాజల్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఏమీ లేదు. అయితే తాజాగా ఆమె బేబీ బంప్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కాజల్ అభిమానులు ఈ ఫోటోలను చూసి… ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus