గర్భవతిగా ఉన్నప్పుడు శరీరానికి ఎలాంటి కష్టం పెట్టకూడదు అంటుంటారు కొంతమంది పెద్దలు. అయితే సాధారణ రోజుల్లాగే ప్రెగ్నెన్సీ డేస్‌లో కూడా ఎంచక్కా వ్యాయామం చేయొచ్చు, బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకోవచ్చు అని చెబుతుంటారు నేటి తరం అమ్మాయిలు. మన కథానాయికలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఇదే చేసింది. కాజల్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్ బేబీ బంప్ ఫొటోలు, సీమంతం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇప్పుడుజిమ్‌లో ట్రైనర్ సాయంతో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
వీడియోతో పాటు గర్భవతిగా ఉన్న సమయంలో చేయాల్సిన కసరత్తులకు సంబంధించి సలహాలు, సూచనలతో పెద్ద పోస్టును ఇన్‌స్టాగ్రామ్ రాసుకొచ్చింది కాజల్. ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ ప్రసవం కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి కసరత్తులు చేయాలి అని ఇన్‌స్టా పోస్ట్‌లో కాజల్ పేర్కొంది. ఫిట్‌గా ఉండటానికి ఏరోబిక్స్ ఎంతో సాయపడుతున్నాయి. ప్రెగ్నెన్సీకి ముందు, ఇప్పుడు… శరీరాన్ని మెరుగ్గా మార్చడంలో కసరత్తులు సహాయపడ్డాయి. ఇవి చేయడం వల్ల నా శరీరం బలంగా మారింది.
శరీరాకృతి పరంగా ఫిట్ ఉండగలుగుతున్నా అంటూ తన ట్రైనర్‌తో కలిసి చేసిన వర్కవుట్లను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కాజల్ గతంలోనూ కొన్ని పోస్టులు చేసిన విషయం తెలిసిందే. గర్భధారణ సమయంలో శరీరం బరువు పెరగడంతో పాటు అనేక మార్పులొస్తాయి. హార్మోన్ల మార్పులు, శిశువు పెరిగే సమంలో పొట్ట, రొమ్ముల ఆకృతి పెరుగుతుంది. శరీరం పెద్దగా ఉన్నచోట స్ట్రెచ్ మార్క్స్ రావొచ్చు. ఇలాంటి సమయంలో శరీరం సాధారణంగా కంటే.. ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంది.
తరచూ మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి. ఈ సమయంలో విపరీతంగా బరువు పెరిగిపోతాం. ఎమోషన్స్ ఉన్నట్టుండి మారిపోతాయి అని గత పోస్టులో రాసింది కాజల్.గర్భవతి సమయంలో మూడ్ స్వింగ్స్ వల్ల ఒక్కోసారి నెగెటివ్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. దీని వల్ల అనారోగ్యానికీ గురవుతాం. డెలివరీ అయ్యాక సాధారణ స్థితిలోకి రావడానికి సమయం పడుతుంది. అయితే ఈ మార్పులు సహజం అని చెప్పింది కాజల్.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!