వైరల్‌: కాజల్‌ కొంపముంచిన వీడియో కాల్‌..

ఇది సోషల్‌ మీడియా కాలం… తప్పొ, పొరపాటో జరిగిపోయాక తూచ్‌ అంటే అస్సలు అవ్వదు. దొరికినోడిని దొరికినట్లు వాయించి పారేస్తారు. సోషల్‌ మీడియాలో అయితే ఇది ఇంకానూ. అలా సోషల్‌ మీడియాలో చిన్న అజాగ్రత్త వల్ల ఇప్పుడు కాజల్‌ ఏకంగా మొబైల్‌ నెంబరు మార్చుకోవాల్సి వచ్చిందంటున్నారు. అంతగా ఏమైంది అనుకుంటున్నారో. దానంతటికి కారణం… అక్కాచెల్లెళ్లు మాట్లాడుకున్న వీడియో కాల్‌ స్క్రీన్‌ షాటేనట. కాజల్‌ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌ ఇటీవల వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. ఆ విషయాన్ని చెప్పేలా నిషా అగర్వాల్‌ పోస్ట్‌ చేసింది.

అయితే అందులో చూస్తే… కాజల్‌ కాల్‌ స్క్రీన్‌లో మొబైల్‌ నెంబరు కనిపిస్తోంది. సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ పెట్టినా అణువణువూ గమనించి… ట్రోలింగ్‌కి సిద్ధంగా ఉంటే మన ‘ఎథికల్‌’ ట్రోలర్స్‌ ఈసారి ఆ పాయింట్‌ పట్టేశారు. దాంతో ఇంకేముంది ఆ నెంబరుకు కాల్స్‌ పోటెత్తాయట. సెలబ్రిటీలు తమ నెంబర్లు బయటకు ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో అలా నెంబరు బయటకు వెళ్లిపోవడంతో కాజల్‌ ఇబ్బందులు పడుతోందని సమాచారం. దీంతో ఏకంగా ఇప్పుడు ఆ నెంబరును నిలిపేసిందని సమాచారం. ఇప్పుడు ఆ నెంబరుకు కాల్‌ చేస్తే కనెక్ట్‌ అవ్వడం లేదు.

అయితే ఆ స్క్రీన్‌ షాట్‌ వైరల్‌గా మారింది. ఇలా నెంబరు బహిరంగంగా దొరికితే ఊరుకుంటామా… రెచ్చిపోము అంటూ మీమ్స్‌ కూడా సిద్ధం చేసేశారు. ప్రస్తుతం కాజల్‌ సినిమాలేవీ నటించడం లేదు. గతంలో ఒప్పుకున్న ‘ఘోస్ట్‌’ లాంటి సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. దీంతో నాగార్జున – ప్రవీణ్‌ సత్తారు వేరే నాయికను వెతికే పనిలో పడ్డారు. అయితే ఆమె గర్భవతి అయ్యిందని, అందుకే సినిమాల నుండి తప్పుఉంటూ, కొత్తవి అంగీకరించడం లేదని చెబుతున్నారు.

ఇటీవల కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లూ కూడా వెయిటింగ్‌ ఫర్‌ బేబీ అంటూ ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ కూడా పెట్టారు. సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడానికి ముందు కాజల్‌ తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామికా’ త్వరలో విడుదలవుతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus