Kajal Son: చిన్న చిన్న విషయాలే ఆనందాన్నిస్తాయి: కాజల్

వెండితెర చందమామగా ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం పైగా అగ్ర తారగా వెలిగిన కాజల్ అగర్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అగ్రతారగా పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడుని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే పలు సినిమాల షూటింగులలో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ గర్భవతి అని తెలియడంతో తాను సినిమాల నుంచి తప్పుకొని పూర్తిగా తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఏప్రిల్ 19వ తేదీ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ బాబుకు నీల్ కిచ్లు అని నామకరణం చేశారు.బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బాబుకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ విధంగా తల్లిగా తన కొడుకు పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న కాజల్అగర్వాల్ నిత్యం తన కొడుకుకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా తన కొడుకు మొహం కనపడకుండా ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోని కాజల్ అగర్వాల్ షేర్ చేస్తూ చిన్న చిన్న విషయాలే ఆనందాన్ని ఇస్తాయి అంటూ తన కొడుకుని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇప్పటి వరకు కాజల్ తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా తన కొడుకు మొహం చూపడానికి ఈమె ఇష్టపడటం లేదు.ఈ క్రమంలోనే కాజల్ తన కొడుకును ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus