Mahesh Babu: ‘సర్కారు వారి ‘పాట’ ‘ .. 100 మిలియన్ల కోసం హడావిడి..!

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం పై అభిమానులు ఎన్నో అసలు పెట్టుకున్నారు. నిజానికి 2022 సంక్రాంతికే ఈ మూవీ వస్తుందనుకున్నారు కానీ పరిస్థితులు సహకరించకపోవడం వలన రాలేదు. అయినప్పటికీ ఫిబ్రవరిలో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి అభిమానుల కోపాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు.మొదటి పాట కోసం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ మహేష్ ఫ్యాన్స్ ను తృప్తి పరుస్తున్నారు.

Click Here To Watch

తాజాగా కీర్తి సురేష్, మహేష్ బాబు లకి సంబంధించి ఓ రొమాంటిక్ పోస్టర్ ను కూడా వదిలారు. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’, ‘వకీల్ సాబ్’ లోని మగువా మగువా పాటల్ని మించేలా ఉండాలని.. కచ్చితంగా ఈ పాట యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ కొట్టాలని తహతహలాడుతున్నారు. అందుకోసం సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు చాలా అలెర్ట్ గా ఉన్నారు.

అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ ఆశించిన స్థాయిలో లేదు అనేది ఇన్సైడ్ టాక్. అందుకోసమే ఈ పాట కోసం ఇంతలా ప్రమోషన్స్ మొదలుపెట్టారు అని వినికిడి. అయితే సిద్ శ్రీరామ్ పాడాడు కాబట్టి.. ఈ పాట ఎలా ఉన్నా జనాలు ఎక్కువగా వినే ఛాన్స్ లు ఉన్నాయి. వాలెంటైన్స్ డే స్పెషల్ అంటున్నారు కాబట్టి ఈ కళావతి కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఒకవేళ ఫస్ట్ సింగిల్ కనుక హిట్ అయితే ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ ఊపందుకున్నట్టే..! తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus