ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నా ఈ సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులు ఒకింత టెన్షన్ పడ్డారు. పురాణాలకు, సైన్స్ కు ముడిపెట్టి సినిమా తీయడం సాధ్యమేనా? కల్కి సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతుందా? ఇలా ఎన్నో సందేహాలు అభిమానులను వెంటాడాయి. అయితే కల్కి 2898 ఏడీ సినిమా విడుదలైన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
ఎన్ని అంచనాలు పెట్టుకుని సినిమా చూసినా ఆ అంచనాలను మించేలా సినిమా ఉండటం కల్కి 2898 ఏడీ సినిమాకు ప్లస్ అయింది. రేసీ స్క్రీన్ ప్లేతో నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ ఆలోచనలకు హ్యాట్సాఫ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మెప్పించే సినిమాను తెరకెక్కించడం సులువైన విషయం కాదని నాగ్ అశ్విన్ మాత్రం తన ప్రతిభతో ఆ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశారని చెప్పవచ్చు.
మరోవైపు కల్కి సినిమాలో అశ్వత్థామ తల దాచుకున్న గుడి నిజమైన గుడి అని ఆ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ గుడి పేరు నాగేశ్వరస్వామి ఆలయం కాగా జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. మూడేళ్ల క్రితం తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది. కల్కి సినిమాలో కాశీలో ఈ గుడి ఉన్నట్టు చూపించడం జరిగింది.
కల్కి సినిమాలో అమితాబ్ (Amitabh Bachchan) పాత్ర తల దాచుకున్న గుడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడీ బుకింగ్స్ విషయంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని తెలుస్తోంది. వీక్ డేస్ లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది.