మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ ‘సూపర్ మచ్చి’ వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి. అయితే కళ్యాణ్ మూడో సినిమాగా ‘అశ్వద్ధామ’ దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ‘కిన్నెరసాని’ చిత్రం ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ శీతల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని…. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్’ ‘శుభమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై రామ్ తాళ్లూరి నిర్మించారు.దేశ రాజ్ ఈ చిత్రానికి రైటర్.
వేద అనే అమ్మాయి ఎదుటివారి కళ్ళలో చూస్తూ వారు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తూ ఉంటుంది. అలా ఆమె విలన్ బాగోతాన్ని బయటపెడితే.. అతను అన్నీ కోల్పోయి జైలు పాలవుతాడు.అప్పటి నుండీ ఈమె పై పగ పెంచుకుంటాడు.ఎలాగైనా ఈమెను చంపేయాలని ఫిక్స్ అవుతాడు. అద్భుతం ఉన్న చోటునే ఆపదలు కూడా ఉంటాయి అనే కాన్సెప్ట్ తో ఈ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు దర్శకుడు. కాశీష్ ఖాన్ మరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్ గా నటించాడు.
జీ5 ఓటీటీలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీక్షణలు కూడా బాగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 35 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే చూస్తున్నారట. నిజానికి ‘కిన్నెరసాని’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలి అనుకున్నారు.
కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పోస్ట్ పోన్ అవ్వడం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేకపోతుండడంతో ‘కిన్నెరసాని’ మేకర్స్ నేరుగా ఓటీటీ ని ఆశ్రయించారు. ఇక్కడ మంచి ఫలితం దక్కినట్టు అయ్యింది.