Kinnerasani Movie Teaser: మెగాస్టార్ చిన్నల్లుడికి ఈసారి కలిసొచ్చేలా ఉందే..!

మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కిన్నెరసాని’. అన్ శీతల్ అనే కొత్తమ్మాయి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవుతుంది. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ ‘శుభమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.దేశరాజ్ ఈ చిత్రానికి రైటర్. గతంలో అంటే 7 నెలల క్రితం ఈ చిత్రానికి సంబంధించి ఓ గ్లిమ్ప్స్ ను విడుదల చేసి ఈ మూవీ పై బజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్.

ఇప్పుడు ఓ టీజర్ ను కూడా విడుదల చేసి అందరిలోనూ ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది . ఇక టీజర్ విషయానికి వస్తే.. ‘మీ పాప ఒక అద్భుతం పార్వతి గారు.. కానీ అద్భుతం జరిగే ప్రతీ చోట ఆపదలు ఉంటాయి’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ సాగింది. ‘ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి… అది ద్వేషానికైనా.. చివరికి ప్రేమకైనా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

టీజర్ మొత్తానికి మెయిన్ హైలెట్ మహతి సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. టీజర్ చూడడం పూర్తయ్యాక కూడా ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనల్ని వెంటాడుతుంది. కళ్యాణ్ దేవ్ లుక్స్ బాగున్నాయి. తన మొదటి సినిమా కంటే ఈ సినిమాలో చాలా బెటర్ గా కనిపిస్తున్నాడు. దర్శకుడు రమణ తేజ ఈసారి కూడా ఓ మిస్టరీ థ్రిల్లర్ నే ఎంపిక చేసుకున్నాడు. టీజర్ బాగుంది మీరు కూడా ఓ లుక్కేయండి :


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.