తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది అగ్ర హీరోల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి నందమూరి తారక రామారావు వారసులుగా హరికృష్ణ బాలకృష్ణ వంటి హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.అనంతరం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి వారు ఇండస్ట్రీలోకి వారసత్వాన్ని అందుకొని ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా కళ్యాణ్ రామ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారిపోయారు.
ఇకపోతే తాజగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన కెరియర్లో బింబిసార సినిమా ఎంతో మెమొరబుల్ గా ఉండబోతుందని వెల్లడించారు.
ఇకపోతే తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ తాను కేవలం బాలకృష్ణ బాబాయ్ వల్లనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో చైల్డ్ క్యారెక్టర్ కోసం బాబాయ్ నన్ను సినిమాలలోకి తీసుకు వచ్చారని అలా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని కళ్యాణ్ రామ్ తెలిపారు. బాలనటుడిగా నటించిన తాను హీరోగా తొలిచూపులోనే సినిమాలో అవకాశం వచ్చిందని,
ఈ సినిమా తర్వాత నటించిన అభిమన్యు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఫస్ట్ టైం తాను ఫెయిల్ అయ్యానని ఫీలింగ్ తనలో కలిగిందని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఏం చేయాలని సినిమాలపై ఫోకస్ చేశానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు.సినిమాలు ఫెయిల్యూర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని అయితే ఈ సినిమాలు ఫెయిల్ కావడమే తనకు సినిమాపై ఫ్యాషన్ ను పెంచాయని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!