Kalyan Ram, NTR: తారక్ పర్ ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు.. కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్?

నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారక్ గురించి పరిచయం అవసరం లేదు ఎన్టీఆర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా, హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ నటించినటువంటి బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తాను ప్రతి ఒక్క సినిమాకి ముందు తప్పనిసరిగా ఆ సినిమా గురించి ఎన్టీఆర్ తో చర్చించి తారక్ ఓకే అంటేనే సినిమాను చేస్తానని ఒకవేళ తారక్ నో అంటే ఆ సినిమా గురించి ఆలోచిస్తానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ వెల్లడించారు. బింబిసారా సినిమా విషయంలో కూడా అదే జరిగింది ముందుగా తారక్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

ఒక సినిమా ఎంపిక చేసుకునే విషయంలోనూ అలాగే, సినిమా ఫస్ట్ లుక్ వరకు ప్రతి ఒక్కటి తమ్ముడుతో చెబుతానని ఎన్టీఆర్ ఓకే అన్న తరువాతనే జనాలకు చూపిస్తానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ఒక విషయాన్ని బయటకి చూపించి ఎలా ఉంది అని జనాలను అడగలేము తారక్ అయితే ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తారక్ జడ్జిమెంట్ ఎప్పుడు ఫర్ఫెక్ట్ గా ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

ఫ్యామిలీ పరంగా మా ఇద్దరి మధ్య అనుబంధం ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయంలో ఎన్టీఆర్ ఏది మనసులో దాచకుండా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారని, ఏ విషయంలోనైనా నచ్చకపోతే గుడ్డు మీద ఈక పీకే రకం ఎన్టీఆర్ అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి తనతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచాయి ఇక ఈ సినిమాలో కళ్యాణ్ గురించి సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus