ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’పై ఎలాంటి అంచనాలు లేవనే చెప్పాలి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. నేటి యూత్ కి నచ్చే కంటెంట్ తోనే సినిమా తీశారు. కానీ ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ లాంటి క్రేజీ మాస్ సినిమాల ముందు ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందనేది సందేహమే. పైగా సంతోష్ శోభన్ కి థియేటర్ మార్కెట్ లేదు.
మారుతి దర్శకత్వంలో నటించిన ‘మంచి రోజులొచ్చాయి’ ప్లాప్ కాగా.. ఇటీవల విడుదలైన ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ సినిమాకి మరీ దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. పోనీ డైరెక్టర్ ఏమైనా ఇమేజ్ ఉన్నవాడా అంటే అదీ లేదు. అయినప్పటికీ.. సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారంటే ఆ కాన్ఫిడెన్స్ వెనుక కారణమేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇదివరకు 2017లో ‘ఖైదీ నెంబర్ 150’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలు సంక్రాంతి పోరులో దిగినప్పుడు ‘శతమానం భవతి’ లాంటి మీడియం బడ్జెట్ సినిమా లాభాలు రాబట్టింది.
కమర్షియల్ గా వర్కవుట్ అవ్వడమే కాకుండా.. నేషనల్ అవార్డు సైతం అందుకుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని తమ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది యూవీ క్రియేషన్స్ సంస్థ. కానీ ఈసారి రేసులో దిల్ రాజు ‘వారసుడు’తో పాటు అజిత్ ‘తెగింపు’ సినిమా కూడా ఉంది. ‘వారసుడు’ సినిమాను వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు. ఎలా లేదన్నా..
వారం రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో ఉండేలా చూసుకుంటారు దిల్ రాజు. 2017 నాటి పరిస్థితులకు ఇప్పటికి గ్యాప్ తక్కువే ఉన్నా.. మార్పులు చాలానే వచ్చాయి. అయినా.. ‘కళ్యాణం కమనీయం’ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుందంటే సాహసమనే చెప్పాలి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!