Kamal Haasan: ఆస్కార్ ప్లానింగ్‌లో కమల్, ఆయుష్మాన్.. ఇంకా ఎవరు ఉన్నారంటే?
- June 27, 2025 / 11:45 AM ISTByFilmy Focus Desk
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వార్డుల కమిటీ వచ్చే ఏడాది అవార్డుల కోసం ఆసక్తికర ఎంపిక చేసింది. అవార్డులు తేల్చే కమిటీలో మన దేశం నుండి నలుగురిని తీసుకుంది. అవార్డుల లెక్క తేల్చడానికి ప్రపంచవ్యాప్తంగా 534 మందిని ఎంపిక చేయగా అందులో నలుగురిని తీసుకోవడం గమనార్హం. అకాడమీలో ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియ కోసం వీరిని ఎంపిక చేశారు.
Kamal Haasan
ఈ మేరకు ఈ ఏడాది ఆస్కార్ అకాడమీలో చోటుపొందిన వారి జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. అందులో ప్రముఖ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) లతో పాటు దర్శకురాలు పాయల్ కపాడియా(Payal Kapadia) , భారతీయ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు ఉన్నారు. అలాగే కాస్టింగ్ డైరక్టర్ కరణ్ మాలీ, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్ స్మృతి ముంద్రా ఉన్నారు.

ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేస్తారు. ప్రతిభావంతులైన వీరికి అకాడమీలో చోటు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అకాడెమీ ఈ సందర్భంగతా పేర్కొంది. 19 విభాగాల్లో నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది. ఇక ఈ సంవత్సరం చోటు సొంతం చేసుకున్న 534 మందిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.

జనవరి 12 నుంచి 16 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. పరిశీలన తర్వాత తుది జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు. అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 15న జరగనుంది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డులను కొనాన్ ఓబ్రెయిన్ హోస్ట్ చేస్తారు. మరి ఈసారైనా మన దేశంలో నుండి ఏదైనా సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్తుందేమో చూడాలి. ‘నాటు నాటు’ పాట రూపంలో మనకు అవార్డు వచ్చింది తప్ప. ఉత్తమ విదేశీ చిత్రంగా మనకు ఏ అవార్డూ రాని విషయం తెలిసిందే.












