మరికొన్ని గంటల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్ లో కల్కి టికెట్లు దొరక్క కొంతమంది ఫ్యాన్స్ నిర్మాత అఫీస్ దగ్గర మౌన దీక్ష చేపట్టారంటే ఈ సినిమాకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతోంది. రిలీజ్ రోజున ఉదయం 5.30 గంటల కంటే ముందే ప్రదర్శమయ్యే కల్కి మూవీ షోల టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ (Prabhas) అభిమానులు త్రీడీలో ఈ సినిమాను చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ (Kamal Haasan) మాట్లాడుతూ కల్కి సినిమాను అంగీకరించడానికి 12 నెలలు ఆలోచించానని తెలిపారు. కల్కి సినిమాలో నా రోల్ గురించి చెప్పగానే స్వీయ సందేహం వచ్చిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. నేను దీన్ని చేయగలనా అని అనిపించిందని కమల్ వెల్లడించారు. నాకు విలన్ రోల్స్ చేయడం కొత్త కాదని గతంలో కూడా చాలా సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నేను నటించానని ఆయన పేర్కొన్నారు.
కానీ కల్కి సినిమాలో నా పాత్ర ఆ పాత్రలను మించిన రోల్ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. అందువల్లే ఈ సినిమాకు సైన్ చేయడానికి ఏడాది ఆలోచించానని ఆయన తెలిపారు. కల్కి సినిమాపై కమల్ చేసిన కామెంట్స్ అంచనాలను పెంచాయి. క్యాస్టింగ్ పరంగా కల్కి మూవీ భారీ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
కొన్ని ఏరియాలలో ఈ సినిమా టికెట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొన్ని ఏరియాలలో కల్కి మూవీ బుకింగ్స్ ఇంకా మొదలుకావాల్సి ఉందని తెలుస్తోంది.