కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఫహద్ ఫాజిల్, సూర్య, విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ముగ్గురి పాత్రలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం గమనార్హం.
వందేళ్ల కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా సాధించని స్థాయిలో విక్రమ్ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విక్రమ్ మూవీ తమిళంలో బాహుబలి2 సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం గమనార్హం. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు అందరికీ రికార్డ్ స్థాయిలో లాభాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కమల్ కు ఈ సినిమాతో సక్సెస్ దక్కింది.
ఫుల్ రన్ లో ఈ సినిమా 450 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ ను సాధించింది. కోయంబత్తూర్ లోని కేజీ సినిమాస్ లోని థియేటర్ లో ఈ సినిమా ఏకంగా 113 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితం కావడం గమనార్హం. గ్రాస్, షేర్ కలెక్షన్ల విషయంలో విక్రమ్ సాధించిన రికార్డులు ఫ్యాన్స్ సంతోషానికి కారణమవుతున్నాయి.
ఈ సినిమా సక్సెస్ తో కమల్ హాసన్ తర్వాత సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇండియన్2 సినిమాతో కమల్ హాసన్ మరో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విక్రమ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సూర్య విలన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.