లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ప్రస్తుతం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరినట్లుగా తెలుస్తోంది. నిజానికి బుధవారం రాత్రి కమల్ హాసన్ ఆయన ఆఫీస్ మెట్లు ఎక్కుతుండగా సడెన్ గా కాలు జారీ పడిపోయారట. దీంతో ఆయన కాలికి పెద్ద గాయమే అయింది. వెంటనే గమనించిన అక్కడ స్టాఫ్ ఆయనని హాస్పిటల్ కు తరలించారు.
కమల్ కుడి కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్స్ తెలిపారు. ఈ వారం చివర్లో లండన్ లో జరగబోయే భారతీయ చలన చిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని లైఫ్ టైమ్ అచ్చీవ్మెంట్ అవార్డ్ తీసుకోవాల్సివుంది. కానీ కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా కమల్ లండన్ వెళ్ళే అవకాశాలు లేవు. అలానే ‘శభాష్ నాయుడు’ సినిమాలో షెడ్యూల్ హైదరాబాద్ లో జరగాల్సివుంది. ఇప్పుడు అది కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.