Kangana Ranaut: చమపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ మరోసారి కొత్త వివాదంతో తెరపైకి వచ్చింది. ఆమె ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా రాజకీయ నాయకుల పై విమర్శల బాణాలను వదులుతున్న ఈ బ్యూటీ రీసెంట్ గా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి కూడా మరొక సందేశం పంపింది. ఇటీవల రైతుల కోసం ఆమె కొంత మంది నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.

అయితే కావాలని కొందరు తనను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన కంగనా రనౌత్ పంజాబ్ లోని బతిందకు చెందిన వ్యక్తి నన్ను చంపడానికి వస్తానని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కు సంబంధించిన విషయాన్ని కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తావించింది. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వెంటనే విషయంలో సోనియా గాంధీ చర్యలు తీసుకోవాలి

అని మీ ముఖ్యమంత్రికి సూచించండి అంటూ కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో వివరంగా తెలిపింది. అంతేకాకుండా తాను ఎవరికీ భయపడను అంటావ్ అనవసరంగా తన జోలికి రావద్దు అని కూడా భయపడను అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.