Kangana Ranaut: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల ద్వారా కంగనా రనౌత్ వార్తల్లో నిలిచారు. గత కొన్నిరోజులుగా కంగనా రనౌత్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి కంగనా రనౌత్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంగనా గయ్యాళి అని ప్రేక్షకుల్లో కూడా అభిప్రాయం ఉంది. ఇండస్ట్రీ ప్రముఖులపై కూడా కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

తాజాగా ఇంటర్వ్యూలో యాంకర్ కంగనా రనౌత్ ను మీరు అందరితో గొడవలు పెట్టుకుంటారా? టామ్ బాయ్ లా ఉంటారా? అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న గురించి కంగనా రనౌత్ స్పందిస్తూ ఇలాంటి రూమర్లను ప్రచారం చేయడం వల్ల తనకు పెళ్లి కావడం లేదని కామెంట్లు చేశారు. తాను ఇప్పటివరకు ఎవరినీ కొట్టలేదని ఆమె చెప్పుకొచ్చారు. కంగనా రనౌత్ ధాకడ్ అనే మూవీలో నటించగా వచ్చే వారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో ఏజెంట్ అగ్ని అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్ల కోసం కంగనా రనౌత్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.

రూమర్ల వల్ల సరైన జోడీ దొరకడం లేదని కంగనా రనౌత్ చెబుతుండగా కంగనా రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది. తాను కఠినంగా ఉంటాననే అభిప్రాయం వల్ల పెళ్లి చేసుకోలేకపోయానని కంగనా రనౌత్ తెలిపారు. కంగనా రనౌత్ వివాదాలకు దూరంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కంగనా రనౌత్ ఆటిట్యూడ్ ను మార్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus