విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత లు హీరోయిన్లుగా … నయన్ తార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కె.ఆర్.కె'(‘కన్మణి రాంబో కటీజా’). తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో నోరు తిరగలేని పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. విజయ్ సేతుపతి తెలుగులో మంచి విలన్ గా, సహాయ నటుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు కానీ హీరోగా అతన్ని ఇక్కడి జనాలు యాక్సెప్ట్ చేసింది.
ఇక నయన తార ఇమేజ్ కూడా ఇక్కడ అంతంత మాత్రమే. అయితే ఈ సినిమా జనాలను ఆకర్షించడానికి గల ఒకే ఒక్క కారణం సమంత అని చెప్పాలి. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో అదే రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ప్రమోషన్లు మాత్రం ఇక్కడ కొంచెం కూడా చేయలేదు. కానీ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకే అమ్ముడైంది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
0.60 cr
సీడెడ్
0.25 cr
ఉత్తరాంధ్ర
0.40 cr
ఈస్ట్+వెస్ట్
0.22 cr
గుంటూరు+కృష్ణా
0.48 cr
నెల్లూరు
0.10 cr
ఏపి+ తెలంగాణ
2.05 cr
‘కన్మణి రాంబో కటీజా’ చిత్రానికి రూ.2.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.పోటీగా ‘ఆచార్య’ చిత్రం రిలీజ్ అవుతుంది కాబట్టి ‘కె.ఆర్.కె’ కి హిట్ టాక్ కనుక రాకపోతే బాక్సాఫీస్ వద్ద నిలబడడం కష్టం.