సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. 2024 లో అప్పుడే ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి మరణించారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్ మరణించారు. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు ఇంకో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ దర్శకుడు అనారోగ్య సమస్యలతో మరణించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌కు చెందిన చిదుగు రవిగౌడ్ అనారోగ్య సమస్యలతో మరణించారు. 15 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన రవి గౌడ్ ను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది.
పూరీ జగన్నాథ్ స్ఫూర్తితో అసోషియేట్ డైరెక్టర్‌గా ఎదిగిన (Ravi Goud) రవి గౌడ్… ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి వినోద్ ప్రభాకర్ తో ‘షాడో’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా టైంలో రిలీజ్ అయిన ‘షాడో’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. మరోపక్క రవి గౌడ్ అప్పుల్లో కూరుకుపోయాడట.దీంతో మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం పాడు చేసుకున్నట్టు తెలుస్తుంది.