బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) హీరోగా ఫేడౌట్ అయిపోవడంతో విలన్ రోల్స్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతనికి ‘ఆదిపురుష్’ (Adipurush) లో రావణుడి పాత్రకి ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు ఓం రౌత్ (Om Raut) . దానికి మంచి రెస్పాన్స్ రాలేదు. దర్శకుడు ఆ పాత్రని సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్లనే ప్రేక్షకులు తిరస్కరించడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ (Devara) లో కూడా సైఫ్ కి విలన్ ఛాన్స్ వచ్చింది.
Prabhas
సినిమా హిట్ అయినా సైఫ్ రోల్ ని బాలీవుడ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. ఇలాంటి టైంలో అతనికి మరోసారి ప్రభాస్ సినిమాలో విలన్ గా చేసే ఛాన్స్ రావడం చెప్పుకోదగ్గ విషయం. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడట.
అంటే కాదు డబుల్ రోల్ ప్లే చేస్తున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. గతంలో ప్రభాస్ (Prabhas) పోలీస్ గా కనిపించింది లేదు. ఫస్ట్ టైం స్పిరిట్ కోసం పోలీస్ పాత్ర చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది.మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) కూడా ‘స్పిరిట్’ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్టు లేటెస్ట్ సమాచారం.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన గత సినిమా ‘యానిమల్’ లో (Animal) విలన్ పాత్ర చేసిన బాబీ డియోల్ కి (Bobby Deol) మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఫేడౌట్ అయిపోయాడు అనుకున్న బాబీ డియోల్ మళ్ళీ బిజీ అవ్వడానికి ‘యానిమల్’ కారణం అని చెప్పడంలో సందేహం లేదు. మరి సైఫ్ అలీ ఖాన్ కూడా ‘స్పిరిట్’ తో బిజీ అవుతాడేమో చూడాలి.