కేజీఎఫ్ (KGF) , కేజీఎఫ్2 (KGF 2) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు సక్సెస్ సాధించడానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ కారణమని చెప్పవచ్చు. హీరో పాత్రను పవర్ ఫుల్ గా చూపించడంతో పాటు కథనంతో మ్యాజిక్ చేయడం వల్ల కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే కేజీఎఫ్2 సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా స్పూర్తితో ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.
Kannada
కబ్జా (Kabzaa) , మార్టిన్ (Martin) సినిమాలు కేజీఎఫ్ స్పూర్తితో తెరకెక్కిన సినిమాలు కాగా ఈ సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. బాహుబలి (Baahubali) , కేజీఎఫ్ లను స్పూర్తిగా తీసుకుని సినిమాలను తీస్తే ఆ సినిమాలను మించేలా తెరకెక్కించాలి. సాధారణ స్క్రిప్ట్ లతో అసాధారణ విజయాలను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.
కన్నడ (Kannada) ఇండస్ట్రీ మేకర్స్ ఇకనైనా ఈ తప్పును సరిదిద్దుకుంటారో లేదో చూడాల్సి ఉంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న కొన్ని సినిమాలు మాత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. యశ్ (Yash) , రిషబ్ శెట్టి (Rishab Shetty) కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచేలా సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉండగా రిషబ్ శెట్టి మాత్రం కాంతార ఛాప్టర్1 తో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే. రక్షిత్ శెట్టి (Rakshit Shetty) నటించిన సినిమాలు సైతం కొంతమేర తెలుగు ప్రేక్షకుల మెప్పు అయితే పొందుతున్నాయనే చెప్పాలి. యశ్, రిషబ్, రక్షిత్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారు.