రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా వచ్చిన స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలకు సైతం లాభాలు రాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 1983 సంవత్సరం జులై నెల 7వ తేదీన రిషబ్ శెట్టి జన్మించారు. రిషబ్ శెట్టికి ప్రవీణ్ శెట్టి అనే సోదరుడు ఉన్నారు. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి.
కర్ణాటకలోని కుందాపూర్ రిషబ్ శెట్టి సొంతూరు కావడం గమనార్హం. రిషబ్ శెట్టి ఫిల్మ్ డైరెక్షన్ లో డిప్లొమా చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రిషబ్ శెట్టి సైనైడ్ అనే సినిమా కోసం పని చేశారు. ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా అతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది. రిషబ్ శెట్టి పలు టీవీ సిరీస్ లలో కూడా నటించారు. 2010 సంవత్సరంలో రిషబ్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.
కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో రిషబ్ శెట్టి నటించడం గమనార్హం. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో 2016 సంవత్సరంలో తెరకెక్కిన రిక్కీ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన కిరిక్ పెట్టి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రష్మిక నటించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. రష్మిక కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
తెలుగులో విడుదలైన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించారు. రిషబ్ మూడో సినిమా సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగడ్ కాగా ఈ సినిమాకు రిషబ్ కు నేషనల్ అవార్డ్ రావడం గమనార్హం. ఈ సినిమాకు మరెన్నో అవార్డులు వచ్చాయి. రిషబ్ శెట్టికి 2017లో ప్రగతి శెట్టితో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.