రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార మూవీ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమా పది రెట్ల లాభాలను అందించింది.
అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార2 తెరకెక్కుతుండగా కాంతార2 బడ్జెట్ ఏకంగా 125 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. కాంతార2 సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉండటంతో ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని భోగట్టా. కాంతార సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాలో క్రేజ్ ఉన్న నటీనటులను ఎక్కువగా తీసుకుంటున్నారు. కమర్షియల్ గా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఉండటంతో పాటు గ్రాఫిక్స్ కు సైతం ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించేలా ఈ సినిమా ఉండనుందని భోగట్టా.
కాంతార2 (Kantara2) కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. కాంతార మూవీ 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా కాంతార2 సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాంతార2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. కాంతార2 కమర్షియల్ రేంజ్ ఊహించని స్థాయిలో ఉండనుందని భోగట్టా.